Breaking News

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్

31 st Aug 2021, UTC

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను   రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి  ఎన్ పోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  తెలిపిన వివరాల ప్రకారం ఫెర్నాండెజ్  తన భాగస్వామి లీనా పాల్ ద్వారా రాకెట్‌కు సూత్రధారిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్  వలలో పడ్డారు.ఆమె నిందితురాలు కాదు, కానీ కన్మాన్ సుకేశ్ చంద్రశేఖర్‌ కేసుకు సంబంధించి సాక్షిగా విచారణ చేస్తున్నట్లు  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

శ్రీమతి ఫెర్నాండెజ్ ను ఐదు గంటలపాటు రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్‌లో కీలక వివరాలను  సేకరించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.దర్యాప్తులో బాలీవుడ్ ప్రముఖ నటుడిని  సుకేశ్ టార్గెట్ చేసినట్లు తేలిందని, భద్రతా కారణాల వల్ల నటుడి పేరును బహిరంగపరచలేదని కేంద్ర ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.

ఆగష్టు 24 న, చంద్రశేఖర్‌పై కేసుకు సంబంధించి చెన్నైలోని సముద్ర అభిముఖంగా ఉన్న బంగ్లా, రూ. 82.5 లక్షల నగదు మరియు డజనుకు పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది. నేరపూరిత కుట్ర, మోసం మరియు దాదాపు రూ.200 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు ఆధారపడింది.సుకేశ్  చంద్రశేఖర్ ఈ మోసానికి సూత్రధారి. అతనిపై అనేక ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయి. అతను ప్రస్తుతం జైలులో వున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

 'రెండు ఆకుల' గుర్తుపై వివాదానికి సంబంధించి ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వడానికి చంద్రశేఖర్  ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజకం 'అమ్మ' ఫ్యాక్షన్ నాయకుడు టిటివి దినకరన్ నుండి డబ్బు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox