Breaking News

రౌడీ బేబీ రికార్డు.. నెవెర్ బిఫోర్..!

17 th Nov 2020, UTC
రౌడీ బేబీ రికార్డు.. నెవెర్ బిఫోర్..!

రౌడీ బేబీ వీడియో సాంగ్ తెలుగు నాట ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది. ఇప్పటికి,ఈ పాట హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ పాటను వంద కోట్ల మంది వీక్షించారట. ఒకపుడు ఓ సినిమా హిట్ అయింది అని చెప్పాలంటే, ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని లెక్కించేవారు. ఇపుడు ఆ సినిమాకి యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వస్తే అంత గొప్ప అని తేల్చేస్తున్నారు. అలాంటిది ఓ వీడియో సాంగ్ వంద కోట్ల వ్యూస్ సాధించడం అంటే మాటలేమి కాదు. ధనుష్, సాయి పల్లవిల ఈ పాట ఇపుడు వంద కోట్ల వ్యూస్ రికార్డు ను సాధించిన తొలి సౌత్ ఇండియన్ సాంగ్ గా నిలిచింది. 

యువన్ శంకర్ రాజా సంగీతానికి ప్రభుత్వ కొరియోగ్రాఫ్ చేసిన స్టెప్పులు, డైరెక్టర్ బాలాజీ మోహన్ టేకింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ సాంగ్ లో వారి స్టెప్పులు సింపుల్ గా ఉన్న మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయి. సాయి పల్లవి, ధనుష్ ల గ్రేస్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఈ వీడియో కి అన్ని వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియో కంటే ముందు గా భారత్ లో పంజాబీ పాట "లాంగ్ లాచి" మొదటిసారి వంద కోట్ల మార్క్ ను చేరుకుంది. సౌత్ లో ఈ ఘనత మారి 2 లో రౌడీ బేబీ పాటకు దక్కింది. డైరెక్ట్ తెలుగు పాటల్లో అన్ని వ్యూస్ రాలేదు. అలా వైకుంఠపురంలో బుట్టబొమ్మ సాంగ్ కానీ ఫిదాలో వచ్చిండే సాంగ్ కానీ ఈ ఘనతని దక్కించుకుంటాయేమో చూడాలి. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox