Breaking News

బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన రకుల్ ప్రీత్ సింగ్

10 th Oct 2021, UTC

 నటి రకుల్ ప్రీత్ సింగ్  ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా  తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది, ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో బాలీవుడ్ హీరో జాకీ భగ్నానితో ప్రేమలో వున్నట్లు తెలిపింది. రకుల్ తన  ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వ్రాసింది, థాంక్యూయూ మై లవ్! మీరు ఈ సంవత్సరం నా అతిపెద్ద బహుమతి! నా జీవితానికి రంగులు జోడించినందుకు ధన్యవాదాలు, నన్ను నిరంతరం నవ్వించినందుకు ధన్యవాదాలు, మీతో వున్నందుకుధన్యవాదాలు !! జాకీ భగ్నాని తో కలిసి మరిన్ని జ్ఞాపకాలను సృష్టించడం ఇక్కడ ఉంది అంటూ రాసింది.

 తామిద్దరు  ఒక పార్కులో నడుస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని కూడా  రకుల్ షేర్ చేసుకుంది. జాకీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి ప్రేమ సందేశాన్ని వ్రాసి ప్రపంచానికి వారి సంబంధాన్ని ప్రకటించాడు. టాలీవుడ్‌లో సందీప్ కిషన్ మరియు ఇతరులతో  ఆమె రిలేషన్ షిప్ లో వుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజా పోస్ట్ వాటన్నింటికి చెక్ పెట్టింది.

ప్రముఖ నిర్మాత వషు భగ్నాని కుమారుడు, జాకీ నటుడిగా నిర్మాతగా వున్నారు. అతను రంగ్రేజ్ మరియు మోహిని వంటి చిత్రాలలో నటించారు. ఇటీవల  కూలీ నం 1 మరియు బెల్ బాటమ్ వంటి సినిమాలను నిర్మించారు. బాలీవుడ్  నిర్మాతలుస్టార్ హీరోయిన్లతో ప్రేమలో పడటం అనేది ఎప్పుడూ జరుగుతూనే వుంది. బోనీ కపూర్-శ్రీదేవి, సోనాలి బింద్రే-గోల్డీ బెహల్, రవీనా టాండన్-అనిల్ తడాని  వరుసలో ఇపుడు రకుల్-జాకీ చేరారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox