Breaking News

ప్రధాని మోదీకి ట్విటర్ లో 70 మిలియన్లకు పైగా ఫాలోవర్లు

29 th Jul 2021, UTC

Politicsప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో మైలురాయిని సాధించారు. మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్ లో బుధవారం నాటికి మోదీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 70 మిలియన్లు దాటింది. దీనితో ట్విటర్ లో ఎక్కువమంది ఫాలోవర్లు వున్న నేతగా ఆయన చరిత్ర సృష్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2009 లో మోదీ ట్విట్టర్ ఉపయోగించడం ప్రారంభించారు. 2010 లో ఆయనకు లక్ష మంది అనుచరులు ఉన్నారు. జూలై 2020 లోమోదీకి ట్వటర్ లో ఫాలోవర్ల సంఖ్య 60 మిలియన్ల మార్కును దాటింది. ప్రధాని మోదీ తరువాత, పోప్ ఫ్రాన్సిస్ ఎక్కువగా  53 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జో బిడెన్‌కు ట్విట్టర్‌లో 30.9 మిలియన్ల మంది ఫాలోవర్లు, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ట్విట్టర్‌లో 129.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు 7.1 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో 26.3 మిలియన్ల మంది ఉన్నారు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి 19.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

గతంలో  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్లో ఎక్కువగా 88.7  మిలియన్ల మంది ఫాలోవర్లు వున్నారు, కానీ యుఎస్ కాపిటల్ వద్ద అల్లర్ల కారణంగా అతని ట్విటర్ ఖాతా శాశ్వతంగా నిలిపివేయబడింది. ప్రధాని మోదీ ట్విట్టర్‌లో చాలా చురుకుగా ఉన్నారు మరియు దేశ అభివృద్ధిపై తన అభిప్రాయాలను ప్రసారం చేయడానికి, కొత్త విజయాలు ఎత్తిచూపడానికి మరియు తన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ట్విటర్ ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox