Breaking News

వీరమల్లు సినిమా నుంచి లీక్ అయిన పవర్ స్టార్ పిక్ వైరల్..!

25 th Feb 2021, UTC

దర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కు "వీరమల్లు" అనే టైటిల్ ను అనుకుంటున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా పై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా టైటిల్ పైన, పవన్ గెటప్ పైనా ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈ సినిమా సెట్ నుంచి ఓ ఫోటో లీక్ అయ్యి నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 15 శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో పవన్ బందిపోటు దొంగలా కనిపిస్తారట. ఈ సినిమాకి " 'హరిహర వీరమల్లు" అని కూడా టైటిల్ పెట్టె అవకాశం ఉండొచ్చు. ఈ సినిమా లో పవన్ గెటప్ కోసం దర్శకుడు క్రిష్ చాలా కష్టపడ్డారట. త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా 'పిఎస్పికె 27' వర్కింగ్ టైటిల్ తో కొనసాగుతోంది. ఈ క్రమంలో షూటింగ్ స్పాట్ లో ఉన్న పవన్ ఫోటో ఒకటి లీక్ అయింది. ఈ గెటప్ లో పవన్ యోధుడిలా కనిపిస్తున్నారు. మార్చి 11న మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు పోస్టర్ విడుదల కాబోతోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox