Breaking News

ఏపీ నెక్ట్స్ సీఎం పవన్ కళ్యాణ్.. బ్రహ్మంగారు ముందే చెప్పారు..

22 nd Jun 2022, UTC

Andhrapradesh: కాబోయే సీఎం పవన్‌, ఇది జనసేన నాయకులు చెబుతున్నది అసలే కాదు. బ్రహ్మంగారు చెప్పారు. అవును మీరు వింటున్నది నిజమే. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. కాబోయే సీఎం పవన్‌ అని, దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ ఫొటో సంచలనం రేపుతోంది. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారనేది ఆ ఫోటోలోని సారాంశం. తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ, రాజవారసత్వము నశించినయ, ప్రజారాజ్యము విరసిల్లునయ, తప్పదు నా మాట నమ్మండయ, యస్‌, ఈ ఫొటోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. బ్రహ్మంగారి చెప్పినట్లు వైరల్ అవుతన్న రెండవ లైన్‌లో రాజవారసత్వము నశించునయ అంటూ ఉంది. ఇదే తరహా రాజకీయం ఇప్పుడు ఏపీలో నడుస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ వారసుడిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవేళ జగన్ ఓడిపోతే, చంద్రబాబు వారసుడిగా లోకేష్ నేనున్నానంటూ ముందుకొస్తారు. వైసీపీ, టీడీపీ ఈ రెండు పార్టీల్లో ఎవరు వచ్చినా, రాజుల కాలంలో మాదిరగా వారసత్వమే అవుతుంది. ఒకవేళ బ్రహ్మంగారు చెప్పినట్లు వైరల్ అవుతున్న ఫోటోలో వారసత్వాలు పోయి పవనుడు వచ్చేడయా మొదటి లైన్‌లో చెప్పినట్లు చూస్తే పవన్ కళ్యాణ్‌ రావాలి.

పవన్ కళ్యాణ్‌ ఈ సారి పాలిటిక్స్‌ను, ఎలక్షన్స్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. నెక్ట్స్ ఏపీ సీఎం కావాలన్న పట్టుదలతో పాలిటిక్స్ నడుపుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్న తపనతో సీరియస్‌గా పనిచేస్తున్నారు. ఇటు జనసైనికులు కూడా ఈసారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్‌ కూడా తమ పంథా మార్చుకున్నారు. గతంలో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇటీవల స్పీచ్ లలో పంథా మారింది. పొత్తు పెట్టుకున్నా కానీ సీఎం అభ్యర్థి నేనే అంటున్నారు. నేను మీతోనే ఉన్నా, నాపై నమ్మకం ఉంచండి. ఒక్కసారి జనసేన వైపు చూడాలని ప్రజలను కోరుకుంటున్నా అన్నారు పవన్ కళ్యాణ్. మీ ఆశీర్వచనాలు నాకు ఇవ్వండి. పొత్తుల కోసం మాట్లాడే సమయం కాదు. నా పొత్తులు జనంతోనే. దసరా నవరాత్రుల తరువాత రోడ్లపైకి వస్తాం. ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు పవన్ కళ్యాణ్.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox