Breaking News

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు షురూ...జగన్ కు నిమ్మగడ్డ షాక్..!

09 th Jan 2021, UTC

స్థానిక ఎన్నికల విషయం లో నిమ్మగడ్డ తన పంతం నెగ్గించుకున్నట్లే ఉన్నారు. ఫిబ్రవరి లో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది.  4 దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. ఈ నెల 27న రెండోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది.  ఈ నెల 31న మూడోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వచ్చే నెల 4న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారు. 

అలాగే, ఎన్నికల తేదీలను కూడా ఖరారు చేసారు. ఫిబ్రవరి 5న తొలిదశ పంచాయతీ ఎన్నికలు,  ఫిబ్రవరి 9 న రెండోదశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 13 న మూడోదశ పంచాయతీ ఎన్నికలు,  ఫిబ్రవరి 17న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తాం అని ఎస్ ఈ సి తెలిపింది.  ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ ప్రొసీడింగ్స్ జారీ చేసారు. 

మరో వైపు, రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని పేర్కొంది. అయితే..ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సంప్రదింపులు నిర్వహించింది. జాతీయ, అంతర్జాతీయంగా కరోనా, వ్యాక్సిన్ పరిస్థితులను ఎన్నికల కమిషన్ నిశితంగా గమనించింది. ప్రభుత్వం నూతన పథకాలు ప్రారంభించే ముందు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోమని సుప్రీంకోర్ట్ చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ఆదేశాలను అమలు చేయలేదు. కరోనా సెకండ్ వేవ్ వస్తుందనే సాకుతో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోంది. అయితే, రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు అని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. భయానక పరిస్థితులున్న అమెరికాలోనే ఎన్నికలు జరిగాయి.. ఈ క్రమం లో ఎన్నికలు నిర్వహించాడనికే ఎన్నికల కమిషన్ నిర్ణయించుకుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox