Breaking News

జూన్ 9న తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్న నయనతార

07 th May 2022, UTC

Tirumala: కోలీవుడ్ ప్రేమ జంట న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లు పెళ్ళికి ముస్తాబ‌వుతున్నారు. ఏడేళ్ళ నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వ‌ర‌లో పెళ్ళి పీట‌లెక్క‌బోతుంది. తాజాగా ఈ ప్రేమ ప‌క్షులు పెళ్ళికి మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వీరిద్ద‌రు తిరుమ‌ల‌లో శ్రీవారి స‌న్నిధిలో జూన్ 9వ తేదీన మూడు ముళ్ళ బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు. దీని కోసం వీరిద్ద‌రూ త‌మ పెళ్లి కోసం వేదిక‌ను బుక్ చేసుకోవ‌డానికి తిరుమ‌ల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. తాజాగా ఈ జంట‌ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

నయనతార పెళ్లి కోసం గద్వాల్ చీరతో పాటు కంచిపట్టును కూడా కొంత మంది డిజైనర్లు రెడీ చేసినట్టు సమాచారం. పెళ్లి మాత్రం తిరుమలలో జరిగే అవకాశాలున్నాయి. రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్‌గా ఫైవ్ స్టార్ హోటల్‌లో ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాలయ్య, చిరంజీవి, సమంతలకు ప్రత్యేక ఆహ్వానం అందినట్టు సమాచారం. నయనతార, విఘ్నేష్ శివన్‌ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం డేలీ ఎసిపోడ్‌ల కొనసాగింది. ఇక విఘ్నేష్ శివన్ కంటే ముందు నయనతార, హీరో శింబుతో ప్రేమ వ్యవహారం నడిపించింది. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమ పెళ్లి పీఠలకు వరకు వెళ్లింది. చివరకు ఏమైందో ఏమో వీళ్ల పెళ్లికి చివరల్లో శుభం కార్డు మాత్రం పడలేదు. 

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లే న‌య‌న‌తార న‌టించిన ‘క‌తువాకుల రెండు కాద‌ల్’ విడుద‌లై మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈమె తెలుగులో మెగాస్టార్‌తో క‌లిసి ‘గాడ్‌ఫాద‌ర్’ చిత్రంలో న‌టిస్తుంది. హిందీలో అట్లీ-షారుఖ్ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. వీటితో పాటుగా త‌మిళంలో రెండు సినిమాలు మ‌ల‌యాళంలో ఒక సినిమాలో న‌టిస్తుంది. ఇక విఘ్నేష్ శివ‌న్ అజిత్‌తో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox