Breaking News

ట్రాన్స్ జెండర్లకు ఈ మెట్రో స్టేషన్ అంకితం..!

28 th Oct 2020, UTC

NOIDA, Prime9News :  ట్రాన్స్ జెండర్ల గౌరవార్ధం నోయిడా లో ఓ మెట్రో స్టేషన్ కు  ‘ప్రైడ్ స్టేషన్’గా పేరు మార్చారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన  నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎన్ఎంఆర్‌సీ) నోయిడా లోని సెక్టార్ 50 స్టేషన్ పేరు ని "ప్రైడ్ స్టేషన్" గా మారుస్తూ తాజాగా ప్రకటన చేసింది. ఉత్తర ప్రదేశ్ లో  ఓ స్టేషన్‌ను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ (లింగమార్పిడి సమాజం)కి అంకితమిచ్చిన మొట్ట మొదటి మెట్రో స్టేషన్ నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్. (ఒక్క వ్యక్తి కోసం నడిచిన మెట్రో)

కేవలం పేరుని మార్చడమే కాదు... ఈ మెట్రో స్టేషన్లో ఆరుగురు ట్రాన్స్ జెండర్లకు ఈ సంస్థ ఉద్యోగాలను ఇచ్చింది. ఇంతకుముందు.. కేరళకు చెందిన మెట్రో రైల్ లిమిటెడ్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.. 2017 వ సంవత్సరం లో కేరళకు చెందిన మెట్రో రైల్ సంస్థ మొత్తం 23 మంది ట్రాన్సజెండర్లకు ఉద్యోగాలను ఇచ్చింది. ఈ అంశం అప్పట్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. 

(ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రోకు రూ.916 కోట్ల నష్టం)

తాజాగా.. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ కి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం 4.9 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు.. అయితే.. వారిలో 35 వేల మంది వరకు నోయిడా (రాజధాని) పరిధి లో నే ఉంటున్నారని తెలిపారు.. అయితే.. తాజా లెక్కల ప్రకారం ఈ సంఖ్యా ఇంకా ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. వారి కోసం ఓ మెట్రో స్టేషన్ ను అంకితమివ్వడం సంతోషం గా ఉందని అన్నారు. మరిన్ని జాతీయ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox