Breaking News

సాయిధరమ్ తేజ్ కు మెగాస్టార్ స్పెషల్ బర్త్ డే గిఫ్ట్..!

15 th Oct 2020, UTC

టాలీవుడ్ :నేడు ప్రముఖ టాలీవుడ్  సాయిధరమ్‌ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మామ, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్‌'. ఈ చిత్రం లో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం సాయిధరమ్‌ పుట్టినరోజు సందర్భంగా 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రం నుంచి ఓ బ్రేకప్‌ పాటను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా విడుదలైంది. "ఒగ్గేసిపోకే అమృతా నేను తట్టుకోక మందు తాగుతా. ఒట్టేసి చెబుతున్న అమృతా నువ్వు వెళ్లిపోతే ఒంటరైపోతా" అనే బ్రేకప్ సాంగ్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
 
"నా ప్రియమైన సాయిధరమ్‌తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రం నుంచి 'అమృతా' పాటను విడుదల చేస్తున్నా. నీలాగే సింగిల్‌గా ఉన్న ఎంతోమంది కోసం ఈ పాట. ఎంజాయ్‌" అని ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు. ఇందుకు సాయి ధరమ్ తేజ్ కూడా రిప్లై ఇచ్చారు. "ఎవరైనా కావాలనుకునే బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇదే. నా పుట్టినరోజును మరెంతో స్పెషల్‌గా చేసినందుకు థ్యాంక్యూ సో మచ్‌ మామ. మీ ఆశీర్వాదం కంటే వేరే ఏదీ నేను కోరను. లవ్‌ యూ మామ" అని సాయి ధరమ్ తేజ్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రముఖులు, సెలెబ్రిటీలు సాయి ధరమ్ తేజ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. టాలీవుడ్ హీరో నితిన్ కూడా ట్విట్టర్ లో సాయి ధరమ్ తేజ్ కి విషెస్ చెప్పారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్‌. బ్యాచిలర్‌గా ఆఖరి పుట్టినరోజు ఎంజాయ్‌ చేయ్‌. ఇంతకీ డేట్‌ ఎప్పుడు ఫిక్స్‌ చేశావ్‌" అని శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox