Breaking News

మెగాస్టార్ గుండు వెనుక రహస్యం

15 th Sep 2020, UTC
మెగాస్టార్ గుండు వెనుక రహస్యం

టాలీవుడ్ :కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి గుండు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే. గుండు చేయించుకుని, నల్లటి కద్దాలతో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంటూ చిరంజీవి అర్బన్‌మాంక్‌ హ్యాష్‌ ట్యాగ్‌ జోడించారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చిరు ఏంటీ లుక్? అంటూ కామెంట్లు పెట్టారు. అయితే, చిరు నిజంగా గుండు చేయించుకున్నారా? లేక ఏదైనా యాప్‌ మహిమా? లేదా మేకప్ చేసారా అన్నది తెలియలేదు.

తాజాగా దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తన అర్బన్ మాంక్ లుక్ మేకింగ్ వీడియోను చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. చిరంజీవి గుండు చేయించుకోలేదని, ముగ్గురు మేకప్‌ ఆర్టిస్ట్‌లు కష్టపడి చిరుకు ఆ లుక్‌ తెచ్చినట్లు తెలుస్తోంది. నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. మేజిక్‌ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్‌" అని చిరు వీడియోతో పాటు మెసేజ్‌ కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. కరోనా వైరస్  నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox