Breaking News

ఒంటిపై ఆరు లక్షల తేనెటీగలు

26 th Oct 2020, UTC
ఒంటిపై ఆరు లక్షల తేనెటీగలు

చైనా :తేనెటీగ కుట్టిందంటే భరించలేని బాధ. అయితే ఒకటీ రెండూ కాదు ఏకంగా దాదాపు ఆరు ల‌క్ష‌ల‌కు పైగా తేనెటీగ‌లు కుడితే ఎలా ఉంటుంది? ఊహించడానికే భయంగా వున్నా ఇది జరిగింది. చైనాకు చెందిన రువాన్ లియాంగ్మింగ్ అనే వ్య‌క్తి మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. అంతేకాకుండా తేనెటీగ‌లు కుడుతున్నంతసేపుఅస‌లు త‌న చుట్టూ ఏమీ జ‌ర‌గ‌న‌ట్లు ఎంతో శాంతంగా క‌నిపిస్తున్నాడు. 2016లో జ‌రిగిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు త్రో బ్యాక్ వీడియో అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దాదాపు  637,000కు పైగానే ఉన్న తేనెటీగ‌లు ఉన్నాయ‌ని, ఇది చూస్తుంటే లియాంగ్మింగ్‌కి తేనేటీగ‌ల‌పై ఎంత ప్రేమో అంటూ క్యాప్ష‌న్‌ను జోడించారు. ఇక ఈ వీడియో లేటెస్ట్ పోస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి నెటిజ‌న్లు ట‌న్నుల కొద్దీ లైకులు, షేర్‌ల‌తో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇది చాలా అమేజింగ్ అంటూ ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. ఇంత‌కీ ల‌క్ష‌ల కొద్దీ తేనెటీగ‌లు కుట్టినా అత‌నికి ఏమీ కాకుండా ఎలా ఉన్నాడు? అంటే ఇది ఏ ఒక్క‌రోజులోనో జ‌రిగే ప్ర‌క్రియ కాదని నిపుణులు అంటున్నారు. దీని వెనుక కొన్నేళ్ల శ్ర‌మ ఉండాలని తేనేటీగ‌ల‌తో వ్య‌వ‌హ‌రించేట‌ప్ప‌డు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, లేదంటే ప్రాణానికే ప్ర‌మాద‌మ‌ని వారు అంటున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox