Breaking News

నిజమే.. మహేష్ బాబును బాలీవుడ్ భరించలేదు.. కంగన రనౌత్

13 th May 2022, UTC

Bollywood: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ కామెంట్ల పై ప్రముఖుల స్పందన కొనసాగుతూనే వుంది. ఇప్పటికే  కొందరు బాలీవుడ్ ప్రముఖులు దీనిపై స్పందించారు తాజాగా క్వీన్ కంగన రనౌత్ మహేష్ బాబు వ్యాఖ్యల్లో తప్పు ఏమీ లేదని స్పష్టం చేసింది. 

కంగన తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్  త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ   సందర్బంగా కంగన మాట్లాడుతూ ‘అవును, మహేష్ అన్నది నిజమే. ఆయన్ని బాలీవుడ్ తట్టుకోలేదు. ఎందుకంటే ఆయన్ని బాలీవుడ్ నుంచి ఎంతోమంది సినిమా కోసం సంప్రదించారని నాకు తెలుసు. కానీ, ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ దేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా నిలిచింది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి తగిన రెమ్యూనరేషన్‌ని బాలీవుడ్ ఇవ్వలేదు.

ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. తన పరిశ్రమ పై, ఆయన పని పై గౌరవం చూపడం వల్లనే మహేశ్ ఈ స్థాయిలో ఉండగలిగాడు. దాన్ని మనం ఒప్పుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమ గత 10, 15 ఏళ్లలో తమిళ పరిశ్రమతోపాటు ఇతర ఇండస్ట్రీలు అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లిపోయిందంటూ కంగన పేర్కొంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox