Breaking News

కరోనా కేసుల్లో మహారాష్ట్ర చైనాను దాటేసింది..!

08 th Jun 2020, UTC

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.. . వైశాల్యంలో మూడో స్థానం, జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనాను కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర బీట్‌ చేసింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 3007 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 85,975కు చేరింది. అకోవిడ్‌ పుట్టుకకు కేంద్ర స్థానమైన చైనాలో కేసుల సంఖ్య 83,036 గా ఉంది.

ఇక దేశ వ్యాప్తంగా 6929 మంది మరణించగా..  ఒక్క మహారాష్ట్రలోనే ఆ సంఖ్య మూడు వేలుగా ఉంది. ఆదివారం సాయంత్రం నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70 లక్షల 26 వేలకు చేరగా.. 34 లక్షల 35 వేల మంది కోలుకున్నారు.

2,34,801 కేసులతో ఇటలీ ఏడో స్థానంలో ఉండగా.. 2,54,242 కేసులతో భారత్‌ ఆరో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో 82 వేల కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో, 30 వేల కేసులతో తమిళనాడు రెండో స్థానంలో, 27 వేల కేసులతో ఢిల్లీ, 19 వేల కేసులతో గుజరాత్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox