Breaking News

'మానాడు' తెలుగు రీమేక్ లో హీరో ఎవరు ..?

14 th Jan 2022, UTC
'మానాడు' తెలుగు రీమేక్ లో హీరో ఎవరు ..?

Maanadu Telugu Remake : టైం లూప్ కాన్సెప్ట్ తో మనం చాలా సినమలే చూసిఉంటం అయితే తాజాగా తమిళ హీరో శింబు - ఎస్ జే సూర్య - కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో ఇదే కాన్సెప్ట్ తో 'మానాడు' అనే చిత్రాని తెరకెక్కించారు, దీనికి స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అయింది.థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ మూవీ విశేష స్పందన తెచ్చుకుంది.

తెలుగులో ఈ చిత్రాన్ని ఎవరు రీమేక్ చేస్తారని అని అనుకుంటుండగా ప్రముక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ వారు'మానాడు' తెలుగు డబ్బింగ్ రైట్స్ తో పాటు అన్నీ బాషాల రీమేక్ రైట్స్ సొంతం చేస్కున్నరని అధికారికంగా ప్రకటించారు. చాలా రోజులతర్వాత హీరో శింబు 'మానాడు' సినిమాతో మళ్ళీ తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని అనుకోని 'రివైండ్' పేరుతో డబ్బింగ్ కూడా చేసి టీజర్వదిలారు. ఆ తర్వాత 'ది లూప్' గా పేరు చేంజ్ చేసి గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అల్లు అర్జున్ - బన్నీ వాసు సహాయంతో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వర్కౌట్ అవలేదు.

'మానాడు' చిత్ర నిర్మాతలు ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ దగ్గుబాటి రానాకు సంబంధించిన కాస్టింగ్ ఏజెన్సీ క్వాన్ కి అమ్మడానికి అగ్రీమెంట్ ఇచ్చేశారట. అయితే ఈ లోపే సినిమా తమిళంలో విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో ఈ సినిమాను తామే తెలుగులో రీమేక్ చేస్తామని మానాడు టీమ్ కి రానా టీమ్ ఓక ఆఫర్ ఇచ్చారట. దీంతో తమిళ నిర్మాతలకు అఫర్ నచ్చి డబ్బింగ్ చేసే ఆలోచన మనుకున్నారంట. ఇపుడు 'మానాడు' రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా రీమేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా వార్తలు వొచ్చినపటికి ఈ సినిమాలో దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పెట్టడానికి మేకర్స్ ట్రై చేస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక టాక్ వినిపిస్తోంది. రానా తమ్ముడు సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా క్రియేటివ్ డైరెక్టర్ తేజ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది, ఇదే క్రమంలో అభిరామ్ తో 'మానాడు' తెలుగు రీమేక్ రూపొందించాలని నిర్మాతలు చూస్తున్నారట.

కానీ 'మానాడు' సినిమా రీసెంట్ గా సోనీ లివ్ ఓటీటీలో తెలుగు,తమిళ బాషలో స్ట్రీమింగ్ అయింది. ఆడియన్స్ ఆల్రెడీ ఈ సినిమా ని తెలుగులో చూసేసారు. అలాంటి మూవీని ఇప్పుడు మళ్ళీ తెలుగులోకి రీమేక్ చేస్తే ఫలితం ఉంటుందో లేదో చూడాలి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox