Breaking News

ఇద్దరం చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. కొడాలినానికి బోండా ఉమ సవాల్

22 nd Jan 2022, UTC

Bonda Uma challenge to Kodalinani:  గుడివాడలోని  తన కళ్యాణ మండపంలో క్యాసినో, పేకాట వంటివి నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. అంతేకాకుండా టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా కొడాలి నాని సవాలుపై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన బొండ ఉమ.. కన్వెన్షన్ సెంటర్ లో ఏ తప్పూ జరగకుంటే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. కేసినో జరిగిందని నిరూపించడానికి తాము సిద్దంగా ఉన్నట్టుగా చెప్పారు. 

కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌‌లోనే కేసినో నిర్వహించారని.. తమ ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కొడాలి నాని దొరికిపోయి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టుగా విమర్శించారు. కొడాలి నాని సవాలను తాము స్వీకరిస్తున్నామని.. కేసినో జరిగిందని నిరూపించడానికి సాక్ష్యాధారాలు ఉన్నామని చెప్పారు. ఎప్పుడో రావాలో చెప్పాలని.. డేట్, టైమ్ కొడాలి ఫిక్స్‌ చేసినా సరేనని సవాలు విసిరారు. చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందామని.. కేసినో జరిగిందని మీడియా ముఖంగా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. కేసినో జరగలేదంటే పెట్రోల్ పోసుకునేందుకు తాను సిద్ధమని తెలిపారు. కేసినో జరిగినట్టు రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని బొండా ఉమ సవాలు విసిరారు. కేసినోలో డ్యాన్స్ చేసిన వారి పేర్లు కూడా తమ వద్ద ఉన్నాయని... విక్టర్, శశిభూషణ్ వంటి వాళ్లు డ్యాన్స్ చేశారని చెప్పారు. తాము కే కన్వెన్షన్ తనిఖీకి వెళ్తే ప్రభుత్వం వణికిపోయిందన్నారు. మహిళల అర్థనగ్న నాట్యాలను తానే ఆపించానని కొడాలి నాని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కేసినో జరిగిన వీడియోలను మీడియాకు చూపించారు.

ఇక, టీడీపీ నిజనిర్దారణ కమిటీపై స్పందించిన కొడాలి నాని.. చంద్రబాబుకు  టైం అయిపోయిందని.. ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లందరితో నిజ నిర్థారణ కమిటీ వేశారంటూ ఆయన దుయ్యబట్టారు. ప్రశాంతంగా వున్న గుడివాడలో నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గొడవలు పెడుతున్నారంటూ కొడాలి నాని ఆరోపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేష్ వార్తలు చదవండి  

 రవితేజ రావాణాసుర స్పెషాలిటీ ఏంటో తెలుసా?

నేచురల్ స్టార్ మూవీలో మలయాళ స్టార్

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox