Breaking News

ఈ ఏడాది హజ్ యాత్ర లేనట్టే..!

11 th Jun 2020, UTC
ఈ ఏడాది హజ్ యాత్ర లేనట్టే..!

2020 హజ్‌ యాత్ర షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెలలో  ప్రారంభం కావాలి. అయితే యాత్ర కు సంబంధించి సౌదీ ప్రభుత్వం ఏ సమాచారం తెలియజేయడం లేదు.ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదని, దీంతో కేంద్ర హజ్‌ కమిటీ ఈ ఏడాది యాత్ర రద్దయినట్టేనని చెబుతోందని రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ మసీవుల్లా, ఎగ్జిక్యూటివ్‌ అధికారి బి.షఫీవుల్లా బుధవారం విలేకరులకు తెలిపారు. ఈఏడాది హజ్‌ యాత్రకు ఎంపికైన యాత్రికులు మొదటి విడతగా రూ. 81 వేలు జమ చేశారన్నారు.

మరికొంత మంది రెండవ కిస్తు రూ.1.20 లక్షలు కూడా చెల్లించారని, రాష్ట్ర యాత్రికులు చెల్లించిన డబ్బు కేంద్ర హజ్‌ కమిటీ వద్ద ఉందన్నారు. ఈ ఏడాది కరోనా ప్రభావంతో హజ్‌ యాత్ర రద్దయిన నేపథ్యంలో కేంద్ర హజ్‌ కమిటీ యాత్రికులకు వంద శాతం డబ్బులు తిరిగి ఇస్తుందన్నారు.


తమ యాత్రను రద్దు చేసుకుంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి తిరిగి వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. యాత్ర రద్దు చేసుకునే వారు కేంద్ర హజ్‌ కమిటీ వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవచ్చని లేని పక్షంలో రాష్ట్ర హజ్‌ కమిటీని 040–23298793లో సంప్రదించాలన్నారు.

 . కోవిడ్‌ వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని ఈ ఏడాది జరగబోయే హజ్‌ యాత్రకు అనుమతించబోమని  ఫిభ్రవరిలో సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దేశాల నుంచి మక్కాకు వచ్చే యాత్రికులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.


వారిని మక్కాలోకి అనుమతించబోమని తెలిపింది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించే వారిని సైతం అనుమతించబోమని ప్రకటించింది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు కొనసాగుతాయనే దానిపై మాత్రం సౌదీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.  

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox