Breaking News

16 చెరువులు తవ్వించిన గొర్రెలకాపరి ..మన్ కీ బాత్ లో అభినందించిన ప్రధాని మోదీ..!

29 th Jun 2020, UTC
16 చెరువులు తవ్వించిన గొర్రెలకాపరి ..మన్ కీ బాత్ లో అభినందించిన ప్రధాని మోదీ..!

కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడి పేరు నిన్న దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. తన ప్రాంతంలో నీటి ఎద్దడి తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించిన ఆ వృద్ధుడిని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో అభినందించారు.

కర్ణాటకలోని . మాండ్య, దసనదొడ్డి ప్రాంతానికి చెందిన కామె గౌడ గొర్రెల కాపరి. తమ ప్రాంతంలో నీటి ఎద్దడిని తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించి పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ సామన్య గొర్రెల కాపరికి  
ఇంత కష్టపడి చెరువులు తవ్వడం  చాలా పెద్ద విషయం. తన ప్రాంతంలో చెరువులు తవ్వించి.. నీటి సమస్యను తీర్చడంతో ఆ ప్రాంత ప్రజలు కామె గౌడను ‘కేరె’(చెరువుల)గౌడ అని గౌరవంగా పిల్చుకుంటున్నారుదాంతో ఇది ప్రధాని దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో నిన్నటి ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో నరేంద్ర మోదీ కామె గౌడను ప్రశంసించారు.

దీనిపై  కామె గౌడస్పందిస్తూ.. నిన్నటి కార్యక్రమంలో ప్రధాని కరోనా వైరస్‌ గురించి జనాలను హెచ్చరించారు.. సరిహద్దు వివాదం గురించి మాట్లాడారు. ఇన్ని ముఖ్యమైన అంశాల మధ్య ఆయన నా పేరును ప్రస్తావించి.. అభినందించారు. నా జీవితానికి ఇంతకంటే పెద్ద సంతోషం ఏం ఉంటుంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

 ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మన అమర జవాన్ల ను కొనియాడారు. దేశంలో పౌరులందరూ స్దానిక ఉత్పత్తులనే వినియోగించాలని కోరారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox