Breaking News

ఇక ఆ దేవుడే దిక్కు.. : కర్ణాటక ఆరోగ్య మంత్రి

16 th Jul 2020, UTC

 కరోనా మహమ్మారి కేసులు తీవ్ర స్థాయి లో పెరుగుతున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్యా ను చుస్తే గుండె గుభేలుమంటోంది.. మరో వైపు.. పరీక్షల సంఖ్యా పెంచితే.. ఈ కేసుల సంఖ్యా కూడా ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది.. ఈ నేపధ్యం లో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అందరూ ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.. మరి కొందరు.. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చిస్తున్నారు.
 
             ఈ పరిస్థితిల్లో కర్ణాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు మాత్రమే కలకలం రేపుతున్నాయి.. ఈ వైరస్ బారి నుంచి దేవుడే కాపాడాలని ఆయన అనడం తో.. ప్రభుత్వం పై ధైర్యం పెట్టుకున్న వారు షాక్ అయ్యేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. బి.శ్రీ రాములు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారికి పేద, ధనిక, కులం, మతం లేదని , స్థాయి అంతస్తు అనే తేడా లేకుండా అందరికి సోకుతోందని అన్నారు. 
 
           రాష్ట్రంలో కరోనా కేసులు రోజుల వ్యవధిలోనే డబుల్ అవుతాయని తెలిపారు. ఈ పరిస్థితి నుంచి దేవుడు మాత్రమే గట్టెక్కిస్తాడని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటకలోని సొంత బీజేపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.  ఈ వ్యాఖ్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి లో విఫలం అయింది అనే సూచనలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని పలువురు రాజకీయ నాయకులూ, సొంత పార్టీ నేతలు  విమర్శిస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox