Breaking News

భారత్ మొత్తం ప్రపంచానికి వాక్సిన్ అందించగలదు : బిల్ గేట్స్

16 th Jul 2020, UTC

కరోనా మహమ్మారిని అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తం గా ఉన్న శాస్త్రవేత్తలు వాక్సిన్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత్ లో కూడా ఇప్పటికే పలు వాక్సిన్ లు క్లినికల్ ట్రయల్స్ దశ కు చేరుకున్నాయి.. ఈ నేపధ్యం లో మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.. మొత్తం ప్రపంచానికి అవసరమైనంతగా కరోనా వ్యాక్సిన్‌ను అందించే శక్తి భారతదేశంలోని ఫార్మా కంపెనీలకుందని ఆయన ఈ సందర్భం గా పేర్కొన్నారు. భారతదేశంలో ఎన్నో ప్రముఖమైన విసయాలు చోటుచేసుకుంటున్నాయని, మానవాళికి ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. ఇండియా లోని ఫార్మా పరిశ్రమ చాలా మెరుగ్గా ఉందని కితాబిచ్చారు. "భారత్‌కు చాలా సామర్ధ్యముంది. ప్రపంచానికి పెద్దమొత్తంలో మందులు, వ్యాక్సిన్‌లను అందించే సంస్థలు అక్కడే ఉన్నాయి. ప్రపంచంలొ మరెక్కడా లేనట్లుగా... పలు వ్యాక్సిన్‌లను భారత్‌లోనే తయారు చేశారు. భారత్ లోని ఫార్మా ఇన్స్టిట్యూట్ లలో సీరం ఇన్స్టిట్యూట్ చాలా పెద్దది.. దీంతో పాటు బయో ఈ, భారత్ బయోటెక్ తదితర సంస్థలు కూడా పెద్దవే" అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు..  కరోనా వ్యాక్సిన్ ను భారత్ త్వరలోనే ప్రపంచానికి అందిస్తుందని భావిస్తున్నానని బిల్‌గేట్స్ నమ్మకం గా చెప్పారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox