Breaking News

రోజూ ఆవు మూత్రం తాగుతా... అక్షయ్‌ కుమార్‌

11 th Sep 2020, UTC

వినోదం: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌  కుమార్ ఇటీవల‘ది వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌’ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఏనుగు మలవిసర్జనతో చేసిన టీని తాగారు.  రెండు రోజుల క్రితం బేర్‌ గ్రిల్స్‌, హ్యూమా ఖురేషిలతో అక్షయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో పాల్గొన్నారు . దానిలో భాగంగా హ్యుమా ఖురేషి ఆ ప్రత్యేకమైన టీని తాగమని అక్షయ్‌ని ఎలా ఒప్పించారని’ బేర్‌ గ్రిల్స్‌ని అడిగింది. అందుకు ఆ పని ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ చెడ్డ పని మాత్రం కాదు’ అన్నారు బేర్‌ గ్రిల్స్‌.

ఇంతలో అక్షయ్‌ నేను ప్రతి రోజు ఆము మూత్రం తాగుతాను. కాబట్టి ఈ టీ తాగడానికి నేను పెద్దగా భయపడలేదు. ఆశ్చర్యపడలేదు అని తెలిపారు. అక్షయ్‌ ఆవు మూత్రం తాగుతానని తెలపడం ఇదే ప్రథమం. ఈ సమాధానంతో హ్యుమా ఖురేషీతో పాటు నెటిజనులు కూడా ఆశ్చర్యపోయారు. అక్షయ్‌ మాట్లాడుతూ. ‘ఆయుర్వేదపరంగా ఆవు మూత్రం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నేను ప్రతి రోజు సేవిస్తాను. ఏనుగు వ్యర్థాలతో చేసిన టీ కూడా ఆయుర్వేదపరంగా మంచిదే. అందుకే తాగడానికి ఇబ్బంది పడలేదు అని తెలిపారు.  మరిన్ని బాలీవుడ్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox