Breaking News

నకిలీ ఐపిఎస్ అధికారిగా అవతారం.. నమ్మినోడికి రూ.11 కోట్ల రూపాయల టోపీ

25 th Feb 2021, UTC

హైదరాబాద్ నగరంలో నకిలీ ఐపిఎస్ అధికారిగా  అవతారం ఎత్తి పెళ్లిపేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.11 కోట్లు వసూలు చేసిన యువతిని పోలీసులు అరెస్ట్ చేసారు .కడప జిల్లాకు చెందిన ఉద్దానం శిరీష అలియాస్ స్మృతి సింహ (39)కి చిన్నతనంలోనే అదే ప్రాంతానికి చెందిన మోహన్‌రావు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది సంవత్సరాల క్రితం భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. అప్పటికే విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న అశతో ఉన్న స్మృతి సింహ మకాంను హైదరాబాద్‌కు మార్చింది. సినిమాలలో నటించాలన్న ఆశతో యాక్టింగ్‌కు సంబంధించిన కోర్సుల్లో శిక్షణ తీసుకుంది. సినిమాలు కలిసి రాకపోవడంతో బోరబండ ప్రాంతంలో 2015లో సింహ పేరిట సూపర్ మార్కెట్‌ను ప్రారంభించింది. సూపర్‌మార్కెట్‌కు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ రిపేరింగ్ చేసేందుకు వచ్చే అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిరువురికి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో 2017వ సంవత్సరంలో మకాంను బాచుపల్లిలోని ఎపిఆర్ ప్రణవ్ అన్‌టిల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఓ విల్లాలోకి మారి సహజీవనం చేస్తున్నారు. అక్కడే వీరికి పక్క విల్లాలో ఉండే వీరారెడ్డితో పరిచయం ఏర్పడింది.

తమ అవసరాల నిమిత్తం చేబదులుగా కొంత డబ్బులు కావాలంటూ మొదట్లో 13 లక్షలతో మొదలు పెట్టి అప్పుప్పుడు మరికొంత మొత్తాన్ని తీసుకున్నారు. ఆ తరువాత లాక్‌డౌన్‌తో మార్కెట్ ఏం బాగోలేదని  మరింత డబ్బులు కావాలని కోరి  సుమారు రూ.11 కోట్ల వరకు కాజేశారువసూళ్లకు పాల్పడిన డబ్బుతో ఖరీదైన కార్లు, కళ్లుచెదిరే ఆభరణాలు కొనుగోలు చేసింది.  విలాసవంతమైన మూడు బిఎండబ్లు, రెండు ఫోర్డ్ కార్లతో పాటు మియాపూర్ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలో ఏకంగా ఓ విల్లాను కొనుగోలు చేసింది.వీరారెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డిని తనకు డబ్బులు ఇవ్వాలని వత్తిడి చేయడం మొదలు పెట్టాడు. దీంతో విజయ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 5న ప్రగతినగర్‌లో నివాసముండే తల్లిదండ్రుల ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు విషయమై పోలీసులు విచారిస్తుండగా ఈ నెల 12న వీరారెడ్డి పోలీసులను ఆశ్రయించి విజయ్‌కుమార్‌రెడ్డి ముఠా తను చేసిన మోసంపై ఫిర్యాదు చేశాడు.

దీనితో పోలీసులు  శృతి సిన్హాతో పాటు మరో నలుగురి నిందితులను అదుపులోకి తీసుకని విచారించారు.వీరివద్ద నుంచి రూ.50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 5 కార్లు, 7 మొబైల్‌ఫోన్‌లు, రూ. 2లక్షల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 11 డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు పలు పలు పేర్లతో ఉన్న ఆధార్‌కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులతో పాటు పలు సంస్థలకు చెందిన గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సుమారు వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదును, మియాపూర్‌లో కొనుగోలు చేసిన విల్లా వివరాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox