Breaking News

వైద్యురాలే అమ్మవారి రూపంలో..!

17 th Oct 2020, UTC
వైద్యురాలే అమ్మవారి రూపంలో..!

ఏ కష్టమొచ్చినా భగవంతుడిని మొక్కుతాం. కరోనా కాలంలో మాత్రం వైద్యులకే మొక్కాం. వాళ్ళ ప్రాణాలను జీవితాలను సైతం పక్కన పెట్టి ఎందరో వైద్యులు కరోనా రోగులకు ప్రాణం పోశారు. వారి సేవలను కొనియాడలేము. వైద్యో నారాయణో హరిః అని శాస్త్రం కూడా వైద్యుల్ని దైవ స్వరూపులుగా కీర్తించింది. ఈ దేవి నవరాత్రుల సమయంలో వైద్యులే అమ్మవారుగా అర్ధం వచ్చేలా ఓ వైద్యురాలు తీయించుకున్న ఫోటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
 
ఈ ఫోటోలో వైద్యురాలి వెనుక నలుగురు ఎనిమిది చేతుల్లో వివిధ వైద్యపరికరాలు పట్టుకుని ఎనిమిది చేతులు కనిపించేలా ప్రదర్శించారు. ఆ వైద్యురాలు తన రెండు చేతులతో ఓ రోగికి వైద్యం చేస్తుండగా ఈ ఫోటోని తీశారు. అమ్మవారు తన పది చేతులతో ప్రజలను రక్షించినట్లు అర్థంవచ్చేలా ఈ ఫోటోని  తీశారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో హల్ చల్ చేస్తోంది. కరోనా వంటి గడ్డు కాలంలో కూడా ముందు వరుసలో ఉండి అందరి ప్రాణాలను కాపాడుతున్న వైద్యులకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox