Breaking News

బీరూట్‌ పోర్టు డైరెక్టర్‌ అరెస్ట్

07 th Aug 2020, UTC
బీరూట్‌ పోర్టు డైరెక్టర్‌ అరెస్ట్
 
బీరూట్‌ : దేశ రాజధాని బీరూట్‌లో పేలుడు ఘటనకు బాధ్యుడిగా బీరూట్‌ పోర్టు డైరెక్టర్‌ను లెబనాన్‌ మిలటరీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో 135 మంది ప్రాణాలు విడువగా దాదాపు 5 వేల మంది గాయాలపాలయ్యారు. అటార్నీ జనరల్‌ ఫాదీ అకీకీ నేతృత్వంలో పోలీసులు పోర్టు డైరెక్టర్‌  హస్సాన్‌ కోరేటమ్‌తో పాటు మరో 16 మంది కస్టడీలోకి తీసుకున్నారు. వీరంతా పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్‌ నిల్వ ఉంచిన గోడౌన్‌ 12 వద్ద విధుల్లో ఉన్నారు. పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల్లో గోడౌన్‌ 12 సిబ్బంది నిర్లక్షాన్యికి సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయని ఎన్‌ఎన్‌ఏ మీడియా తెలిపింది. పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పింది.
 
మానవ తప్పిదం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు లెబనాన్‌ దేశాధ్యక్షుడు మిచెల్‌ అవున్‌ చెప్పారు. నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు వెల్లడించారు.  దర్యాప్తులతో ఒరిగేదేమీ ఉండదని, పేలుడు పదార్థాలు పోర్టులోకి రాకుండే అడ్డుకుంటే చాలని బీరూట్ వాసులు  అంటున్నారు. మరిన్ని వార్తలు చదవండి : పైనాపిల్ లో బాంబుని పెట్టి..గర్భం తో ఉన్న ఏనుగు ని చంపిన వైనం..!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox