Breaking News

హెయిర్ కటింగ్ సరిగా చేయనందుకు రూ.2 కోట్లు నష్టపరిహారం ఢిల్లీ లగ్జరీ హోటల్ కు షాకిచ్చిన వినియోగదారుల కమీషన్

24 th Sep 2021, UTC

ఒక మహిళకు  హెయిర్ కట్ సరిగా చేయనందుకు ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్  రూ.2 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని  జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ( ఎన్ సీ డీఆర్ సి ) ఆదేశాలు జారీ చేసింది.   హోటల్ సెలూన్ నిర్లక్ష్యం కారణంగా మోడలింగ్ చేస్తున్న సదరు మహిళ పలు  అసైన్‌మెంట్‌లను  కోల్పోయింది. మోడలింగ్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్న ఆమె కల సిబ్బంది పొరపాటు కారణంగా సర్వనాశనం అయిందని  కమీషన్ వ్యాఖ్యానించింది.

ఈ మేరకు  ఎన్ సీడీఆర్ సీ అధ్యక్షుడు ఆర్కే అగర్వాల్, సభ్యుడు ఎస్ఎమ్ కాంతికార్ ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు తమ  జుట్టుతో భావోద్వేగపరమైన అనుబంధం ఉంటుందని,  వాటిని సంరక్షించుకునేందుకు,  మంచి స్థితిలో ఉంచుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శక్తికొద్దీ  ఖర్చు చేస్తారని వ్యాఖ్యానించారు.  వారి జుట్టు విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా మరియు జాగ్రత్తగా ఉంటారనడంలో సందేహం లేదు. వారు జుట్టును మంచి స్థితిలో ఉంచడానికి అందమైన మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ఆమె పొడవాటి జుట్టు కారణంగా  జుట్టు ఉత్పత్తులకు మోడల్. ఆమె  విఎల్ సిసి  మరియు  పేంటీన్  కోసం మోడలింగ్ చేసింది అని ప్యానెల్ ప్రెసిడెంట్  ఆర్ కే  అగర్వాల్ మరియు సభ్యుడు  ఎస్ ఎమ్ కాంతికర్ పేర్కొన్నారు.

ఫిర్యాదు దారైన అషనా రాయ్  తనకున్న పొడవైన జుట్టు కారణంగా పలు కేశ సంరక్షణ ఉత్పత్తులకు మోడల్గా వ్యవహరించారని,  అనేక పెద్ద బ్రాండ్లకు పనిచేశారని కమిషన్ పేర్కొంది. అయితే, ఆమె సూచనలకు వ్యతిరేకంగా హెయిర్ కట్ చేయడం వల్ల అవకాశాలు దూరమయ్యానని,  ఆమె జీవితమే మారిపోయిందని, ఈనెల 21న జారీ చేసిన ఉత్తర్వులో కమిషన్ స్పష్టం చేసింది.  సిబ్బంది పొరపాటు కారణంగా ఆమె తల కాలిపోయిందని,  ఇప్పటికీ  దురద, అలర్జీతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించింది. ఫిర్యాదురాలి  వాట్స్అప్ చాట్ ను  పరిశీలించగా  హోటల్ యాజమాన్యం  తన తప్పును  అంగీకరించడంతో పాటు  దిద్దుబాటు చర్యలు  చేపడతామని  అంగీకరించిందని  ఎన్ సీడీఆర్ సీ చెప్పింది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox