Breaking News

చిరు పుట్టినరోజు సందర్భం గా మోహన్ బాబు స్పెషల్ గిఫ్ట్..!

23 rd Aug 2020, UTC

టాలీవుడ్: నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ను అందించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నిన్న తన 65వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు నాడు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ కురిపించారు. ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. నటుడు మోహన్ బాబు తన మిత్రుడు చిరంజీవికి బర్త్ డే గిఫ్ట్ పంపారని ఈరోజు తెలిసింది.

మోహన్ బాబు పంపించిన కానుకను చిరంజీవి ట్విట్టర్ లో తన అభిమానులకు కూడా చూపించారు. అది చెక్కతో చేసిన హార్లే డేవిడ్సన్ బైక్ నమూనా. ఈ గిఫ్ట్ పై మెగాస్టార్ చిరంజీవి కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు. "నా చిరకాల మిత్రుడు తొలిసారిగా నా పుట్టినరోజు నాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థాంక్యూ మోహన్ బాబు" అని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. మరిన్ని టాలీవుడ్ న్యూస్ చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox