Breaking News

ట్విట్టర్  ట్రెండింగ్ లో బాయ్ కాట్ తాండవ్ 

16 th Jan 2021, UTC

బాలీవుడ్ :కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2020లో అనేక సినిమాలు డిజిటల్ బాట పట్టాయి. పాతాల్ లోక్ మరియు ఎ సూటిబుల్ బాయ్ వంటి వెబ్ సిరీస్ నుండి సడక్ 2 వంటి సినిమాల వరకు న్యాయ వివాదాలను ఎదుర్కోవలసి వచ్చింది.  2021 ప్రారంభం కూడ ఇటువంటి వివాదంతోనే మొదలయింది. ఈ సంవత్సరం మొదటి ప్రధాన సిరీస్‌లో ఒకటైన తాండవ్ నెటిజన్లలో ఒక విభాగం యొక్క మనోభావాలను దెబ్బతీసింది.

హిందూ దేవుళ్ళను చులకనగా చూపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సన్నివేశం పై బాయ్ కాట్ తాండవ్ అనే హ్యాష్‌ట్యాగ్ కింద ట్విట్టర్ వ్యాఖ్యలతో నిండిపోయింది. మొహమ్మద్ జీషన్ అయూబ్ పాత్ర శివుడిని పోలి వుండటం, కాలేజీ థియేటర్ ఫెస్టివల్‌లో త్రిశూల్ లాగా ఉండే కర్రను పట్టుకొని ఉన్న దృశ్యం పై నెటిజన్లు అభ్యంతరం తెలిపారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి మరియు తన అనుచరులను పెంచడానికి అతను ఎలా ట్వీట్ చేయాలి లేదా చిత్రాలను పోస్ట్ చేయాలనే దాని పై అతను చెబుతాడు. తరువాత ప్రేక్షకులు చాలా వివాదాస్పదమైన ‘ఆజాది’ శ్లోకాలు చేస్తారు. ఈ దృశ్యం సిరీస్ యొక్క మొదటి ఎపిసోడ్ లో వుంది.

'వినోదం' కోసం ‘దేవతలను, ధర్మాలను ఉపయోగించడం పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిలో చాలామంది ఐఎండిబిలో వన్ స్టార్ ఇచ్చి స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు.కొందరు కఠినమైన చర్యలు తీసుకోవాలని పిలుపునివ్వగా, భారతీయ జనతా పార్టీ నాయకుడు గౌరవ్ గోయెల్ మనస్తాపం చెందిన ప్రజలను పోలీసులను సంప్రదించాలని కోరారు.

తాండవ్ శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌ లో విడుదలయింది. రాజకీయాలు మరియు అధికారం కధావస్తువుగా వున్న ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా, కృతిక కమ్రా, డినో మోరియా, సారా జేన్ డయాస్, సునీల్ గ్రోవర్, టిగ్‌మన్‌షు ధులియా, షోనాలి నాగ్రానీ తదితరులు నటించారు. దీనికి అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.ఈ ధారావాహికలో తొమ్మిది ఎపిసోడ్లు ఉన్నాయి. అన్నీ ఒకేసారి విడుదలయ్యాయి.
మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox