Breaking News

జాతీయగీతం రాని వ్యక్తి విద్యాశాఖా మంత్రా?

19 th Nov 2020, UTC

బిహార్‌ విద్యాశాఖ మంత్రి మేవలాల్‌ చౌదరీ జాతీయగీతాన్ని తప్పుగా పాడటంతో నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఒక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యి.. జెండా ఎగురవేసిన మంత్రి అనంతరం జాతీయ గీతం ఆలపించారు. అయితే మేవలాల్‌ జనగణమణ పాడుతూ మధ్యలో కొన్ని పదాలను మర్చిపోయారు. "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా" కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడారు. దీనితో  మీ మనస్సాక్షి ఎక్కడ మునిగిపోయింది?" అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరలవ్వడమే కాక ట్రోల్‌ అవుతోంది. ఈ వీడియోని ఇప్పటికే  2.2 లక్షల మంది వీక్షించారు. 

దీనిపై నెటిజనులు ఇలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది 2020 సంవత్సరం ఇప్పటికి జాతీయ గీతం రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం నిజంగా సిగ్గు చేటు. స్కూల్లో ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలు విద్యాశాఖ మంత్రికి తెలియకపోవడం దురదృష్టం. అసలు మీరు బడికి వెళ్లారా లేదా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

మరోవైపు ప్రతిపక్ష ఆర్జేడీ నాయకులు కూడ దీనిపై విమర్శలు గుప్పించారు. పలు అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరికి జాతీయ గీతం కూడా తెలియదు. నితీష్ కుమార్ జీ ఇంతకన్నా అవమానం ఏం ఉంటుందంటూ వారు దుమ్మెత్తి పోస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox