Breaking News

అంతరిక్షంనుంచి ఓటు వేసింది..

26 th Oct 2020, UTC
అంతరిక్షంనుంచి ఓటు వేసింది..

NASA :  ప్రపంచ వ్యాప్తంగా  అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా  అధ్యక్ష  ఎన్నికలకు సంబంధించి ఓటింగ్‌ నవంబర్‌ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమెరికన్ మహిళా వ్యోమగామి కేట్ రూబిన్స్ అంతరిక్ష కేంద్రం నుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవంబర్‌ 3వ తేదీన జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆమె తన  ఓటు వేశారు. ఓటింగ్‌  జరిగే రోజున తాను  స్పేస్‌ ఉంటానని అందుకే ఓటు వేసినట్లు రూబిన్స్‌ చెప్పింది.  దీనికి సంబంధించిన ఫోటోను నాసా ట్విట్టర్‌ ద్వార షేర్‌ చేసింది. అంతరిక్ష కేంద్రం నుంచి నేను ఈ రోజు ఓటు వేశాను అని రూబిన్స్‌ ఆ ట్వీట్‌లో పేర్కొంది. 

ఈ నెల 14వ తేదీన అంతరిక్షంలోకి ప్రవేశించిన రూబిన్స్‌ ఆరు నెలల పాటు అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకే ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తన ఓటు హక్కును వినియోగించుకుంది. అంతరిక్షం నుంచి ఓటు వేసే సదుపాయాన్ని నాసా 1997 నుంచి కల్పించింది.  అప్పటి నుంచి చాలా మంది వ్యోమగాములు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1997లో మొదటిసారి డేవిడ్ వోల్ఫ్ అనే  వ్యోమగామి అంతరిక్షం నుంచి ఓటును వేశారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox