Breaking News

మరో బెంగాలీ స్వీట్ ఆరోగ్య సందేశ్‌..!

29 th Jun 2020, UTC
మరో బెంగాలీ స్వీట్ ఆరోగ్య సందేశ్‌..!

బెంగాలీల జీవితంలో స్వీట్లు,చేపలకు ప్రత్యేక స్దానం వుంది. ఈ రెండూ లేకుండా వారు రోజును ముగించరు. అయితే బెంగాలీలు స్వీట్లను ఎక్కువగా ఇష్టపడే కారణంగా ఇపుడు  క‌రోనాపై  పోరాడేందుకు అవ‌స‌రమైన రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే స్వీట్ల‌ను మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సుందర్ బన్ అడవుల్లో సేకరించిన తేనెస్వ‌చ్ఛ‌మైన ఆవు పాలు, తుల‌సీర‌సంతో త‌యారుచేసిన ఈ మిఠాయికి 'ఆరోగ్య సందేశ్‌'గా  పేరు పెట్టారు.

పూర్తి స‌హ‌జ‌మైన ప‌ద్ధ‌తిలో దీన్ని త‌యారు చేశార‌ని, ఇందులో ఎలాంటి కృత్రిమ ప‌దార్థాలు, రంగులు  కల‌ప‌లేద‌ని జంతు వనరుల అభివృద్ధి శాఖ అధికారి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మిఠాయితో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని అన్నారు. అయితే ఇది క‌రోనాకు విరుగుడు మందు కాద‌ని, కేవ‌లం రోగ నిరోద‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

 ఆరోగ్య సందేశ్‌కు  ప్ర‌భుత్వ అనుమ‌తి కూడా ల‌భించినందున దీంతో అతి త్వ‌ర‌లోనే సామాన్యుల‌కు అందుబాటు ధ‌ర‌ల్లో అభించ‌నుంద‌ని సుందర్‌బన్స్ వ్యవహారాల మంత్రి మంతురాం పఖిరా తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ప్ర‌ఖ్యాత మిఠాయి త‌యారీ సంస్థ ఇమ్యూనిటీ సందేశ్ పేరుతో ఈ స్వీట్‌ను త‌యారుచేసింది.

 స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌సుపు, తుల‌సి, కుంకుమ‌, యాల‌కులు, తేనే వంటి మూలిక‌లతో దీన్ని సిద్ధం చేయ‌గా వివిధ ప‌రిశోధ‌న‌ల అనంత‌రం దీనికి ప్ర‌భుత్వ గుర్తింపు ల‌భించింది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే గుణాలు ఈ మిఠాయిలో ఉన్న‌ట్లు శాస్త్రీయంగా  తేలింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox