Breaking News

17 ఏళ్ల కలను నెరవేర్చుకున్న అర్జున్

07 th Jul 2021, UTC
17 ఏళ్ల కలను నెరవేర్చుకున్న అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్నారు. తన ఆరాధ్య దైవం  హనుమంతుని ఆలయాన్ని నిర్మించాలనుకున్న అర్జున్ ఈ  మేరకు సక్సెస్ అయ్యారు. 2004 లో శ్రీ అంజనేయం చేసినప్పటి నుండి అర్జున్ హనుమంతుడిపై తన అభిమానాన్ని పలుసార్లు వెల్లడించారు. తాజాగా అర్జున్  చెన్నైలో నిర్మించిన హనుమాన్ ఆలయం ప్రారంభించారు.

కోవిడ్  నేపధ్యంలో ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.  2005 లో అర్జున్ ఆలయం నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనికి  పెజావర్  విశ్వేశ తీర్థ  పునాదిరాయి వేశారు. ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన హనుమంతుడి ఏకశిలా విగ్రహం సుమారు 35 అడుగుల పొడవు ఉంటుంది. దీనిని కర్ణాటక శిల్పి అశోక్ గుడిగర్ చెక్కారు.

ప్రతిరోజూ తాను కొలిచే హనుమంతుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలన్నది తన కల అని అర్జున్ చెప్పారు. చెన్నైలో కోవిడ్ ఆంక్షలు సడలించినందున ఈ ఆలయం ఇప్పుడు ప్రజలను సందర్శనకు అనుమతిస్తున్నారు. తెరవబడుతుంది. ఈ ఆలయం ప్రారంభోత్సవానికి సంబంధించి చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox