Breaking News

నిన్న కార్తీక... నేడు తాప్సీ

28 th Jun 2020, UTC
నిన్న కార్తీక... నేడు తాప్సీ

రెండు రోజుల కిందట హీరోయిన్‌ కార్తీక ఇంటికి లక్ష రూపాయల కరెంట్‌ బిల్లు రాగా, తాజాగా మరో హీరోయిన్‌ తాప్సీకి 36,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కంటే ఈ నెలలో (జూన్‌) దాదాపు 10 రెట్లు బిల్లు ఎక్కువ రావడంతో తాప్సీ . ట్వీటర్‌ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. వారానికో రోజు వెళ్లి వచ్చే ఇంటికి పెద్దమొత్తం కరెంట్‌ బిల్లు రావడం ఏంటని వ్యంగ్యంగా తన అసంతృప్తిని వెలిబుచ్చింది.

ఇది మా అపార్ట్‌మెంట్‌ బిల్లు. క్లీనింగ్‌ కోసమని వారంలో ఒక రోజు ఈ ఆపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటాం. మాములు రోజుల్లో ఎవరూ ఉండరు. ఈ బిల్లు చూస్తుంటే  మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్‌మెంట్‌ను వినియోగిస్తున్నారనే భయం కలుగుతోంది. నిజాన్ని వెలికితీసేందుకు నాకు సహాయం చేయడంటూఎలక్ట్రిసిటీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేస్తూ తాప్సీ ట్వీట్‌ చేసింది.

మూడు నెలల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు పెరగడానికి కారణం ఏంటి? ఏ రకమైన బిల్లును వసూలు చేస్తున్నారని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆమె ప్రశ్నించారు. తాప్సీ ట్వీట్‌పై స్పందించిన ఎలక్ట్రిసిటీ అధికారులు.. మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా తాము బిల్లు ఇచ్చామని  వివరణ ఇచ్చారు.

లాక్‌డౌన్‌ కారణంగా అన్ని చోట్లా మూడు నెలల కరెంట్ వాడకాన్ని కలిపి ఒకటే బిల్లును ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో శ్లాబ్‌లు మారి ప్రతి ఒక్కరికీ  కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox