Breaking News

త్వరలో సుమంత్ పెళ్లి

28 th Jul 2021, UTC
త్వరలో సుమంత్ పెళ్లి

Tollywood : అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించిన నటుడు సుమంత్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. వెడ్డింగ్ కార్డుల పంపిణీ జరుగుతోంది. వెడ్డింగ్ కార్డులపై SP (సుమంత్-పవిత్ర) అనే అక్షరాలను హైలైట్ చేసారు. సుమంత్ కు ఇది రెండో వివాహం.

అతను 2004లో తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే వారి బంధం ఎంతోకాలం నిలవలేదు. 2006లో వారిద్దరు విడిపోయారు. దశాబ్దానికి పైగా ఒంటరిగా వున్న సుమంత్ ఇపుడు మరలా వివాహ బంధంలోకి అడుగు పెడుతన్నారు.

సుమంత్ రామ్ గోపాల్ వర్మ చిత్రం ప్రేమకధతో హీరోగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. చాలా రోజుల తరువాత ఇటీవల కటపధారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా అనగనగా ఒక రౌడీ చిత్రం షూటింగ్ పూర్తి చేసారు.  ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందువల్ల అత్యంత సన్నిహితులు, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరగనుందని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox