Breaking News

ఆచార్య చిత్రంతో అప్పులపాలయ్యాను.. సాయం చేయండి.. మెగాస్టార్ కు డిస్ట్రిబ్యూటర్ లేఖ

07 th May 2022, UTC

Tollywood: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో  తొలిసారిగా పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ  అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 29వ తేదీన విడుదలైంది. అయితే సినిమా ఆశించనంత విజయం అందుకోలేదు. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయ్యిందని తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆచార్య డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి మరోలా ఉంది. మెగాస్టార్ చిరు సినిమా కదా అని ఆచార్యను భారీ మొత్తంతో కొన్నవారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా, అత్యంత దారుణంగా మారినట్లు తెలుస్తోంది. 

ఇలాంటి సమయంలోనే  ఓ డిస్ట్రిబ్యూటర్ చిరంజీవికి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్నాటక రీజియన్ రాయచూర్ జిల్లాకు చెందిన రాజగోపాల్ బజాజ్ అనే డిస్ట్రిబ్యూటర్ మెగాస్టార్ చిరంజీవికి బహిరంగ లేఖ రాశారు. తాను ఆచార్య సినిమాను కొనుగోలు చేశానని, కాని అది ఆశించిన  స్థాయిలో థియేటర్లలో ఆడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తీవ్రంగా నష్టపోయానని చెప్పుకొచ్చాడు. వరంగల్‌ శ్రీనుకు చెందిన కార్తికేయ ఎగ్జిబిటర్స్‌కు భారీగా ప్రీమియం చెల్లించామన్నాడు. కానీ ఇప్పుడు ఆచార్య సినిమాకు అభిమానుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. సినిమా కూడా థియేటర్లలో సరిగా ఆడటం లేదు. దీంతో తాను భారీ నష్టాలు చవిచూస్తున్నామన్నాడు.

కోవిడ్ కారణంగా ఇప్పటికే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు చతికిలా పడిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా చాలా మంది భారీ నష్టాల్లో కూరుకుపోయారు. అందుకే ఇప్పుడు ఆచార్య మూవీ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు చిరు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నట్లు ఆ డిస్ట్రిబ్యూటర్ కోరారు. తాను ఈ సినిమా కోసం మార్కెట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టానని, ఇప్పుడు సినిమా ఆడకపోవడంతో తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మనవిని తప్పకుండా మన్నించి సాయం చేస్తే, తాను భవిష్యత్తులో మిగతా  ప్రాజెక్టుల విషయంలో పనిచేసేందుకు సాయపడుతుందని డిస్ట్రిబ్యూటర్ రాజగోపాల్ బజాజ్ చిరంజీవికి బహిరంగ లేఖ రాశారు. అయితే ఈ లేఖను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది. మరి దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox