Breaking News

మీకేమైనా పిచ్చా.. ఎందుకలా కొట్టుకుంటారు ?

23 rd Aug 2020, UTC

క్రికెట్:  అభిమానం పేరిట గొడవలకు దిగవద్దని మాజీ క్రికెటర్ వీరేందర్ సెహవాగ్  క్రీడాభిమానులకు సూచించాడు.  ధోనీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య గర్షణ జరిగింది. మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలో ధోనీ రిటైర్మెంట్ సంధర్భంగా అతడి ఫ్యాన్స్ ఫ్లెక్సిలు ఏర్పాటు చేసారు. అలాగే, ఖేల్ రత్న అవార్డు వచ్చినందుకు రోహిత్ ఫ్యాన్స్ సైతం ఫ్లెక్సిలు ఏర్పాటు చేసారు. అయితే, రోహిత్ ఫ్లెక్సిలను గుర్తు తెలెయని వ్యక్తులు తొలగించడంతో వివాదం రేగింది. రోహిత్ అభిమాని  ఒకరు ధోనీ అభిమానులను దుషించడంతో అతడిని చెరుకు తోటలోకి తీసుకెళ్లి కొట్టారు. 

దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా స్పందించాడు.'పిచ్చోళ్లలారా… ఏంచేస్తున్నారు మీరు? క్రికెటర్లు బాగానే ఉంటారు, మధ్యలో మీరెందుకు కొట్టుకుంటారు? క్రికెటర్లు ఒకరిని మరొకరు అభిమానిస్తుంటారు. లేకపోతే ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం పిచ్చి ముదిరినట్టు కొట్టుకుంటున్నారు. ఇలాంటి కొట్లాటలు వద్దు. టీమిండియా ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది' అంటూ సెహ్వాగ్ ట్విట్టర్ లో హితవు పలికారు.సెహ్వాగ్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox