Breaking News

సుశాంత్ సింగ్ ఆర్దిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు

31 st Jul 2020, UTC

పాట్నా: సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి 15కోట్ల రూపాయలు రియా కాజేసిందంటూ,అతని తండ్రి కేకే సింగ్‌ పట్నా పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఆయన ఫిర్యాదు మేరకు విచారణ మొదలు పెట్టారు.

సుశాంత్‌ ఎఫ్‌ఐఆర్‌పై వివరణ కోరిన ఈడీ అధికారులు సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించేందుకు బిహార్‌ పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ను స్వాధీనం చేసుకుని ముంబై బాంద్రాలోని  కోటక్‌ మహింద్రా బ్యాంక్‌కు ఈడీ అధికారులు చేరుకున్నట్లు  తెలిసింది.

సుశాంత్‌ ఖాతాతో 17కోట్ల రూపాయలు ఉన్నాయని, అందులో 15కోట్ల రూపాయలు మూడు వేర్వేరు బ్యాంక్‌ ఖాతాలకు డబ్బు బదిలి అయ్యిందని కేకే సింగ్‌ ఆరోపించారు. ఆ ఖాతాలు రియా, ఆమె సోదరుడు, తల్లికి సంబంధించినవేనని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడికి సంబంధించిన నగదు, ఆభరణాలు, ల్యాప్‌టాప్‌, క్రెడిట్‌ కార్డు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు రియా వద్ద ఉన్నట్లు కేకే సింగ్‌ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

దీనిపై ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు(పట్నా) సంజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ రియా సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 15కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించామని చెప్పడం విశేషం. మరి అసలు విషయం ఏమిటన్నది ఈడీ దర్యాప్తులోనే తేలుతుంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox