Breaking News

సుశాంత్ కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు

23 rd Aug 2020, UTC

బాలీవుడ్:  బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.  సుశాంత్‌ ఇంటి వంట మనిషి నీరజ్‌, అతడి మిత్రుడు సిద్ధార్థ్‌ పఠానీలను సీబీఐ  అధికారులు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం వారిద్దరినీ  సుశాంత్‌ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ ఫొటో, ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలను సేకరించారు. సుశాంత్‌ మృతి చెందిన జూన్‌ 14 నాటి  వివరాలను నమోదు చేసుకున్నారు. జూన్ 14కు ముందు జరిగిన విషయాలపై కూడా ఆరా తీశారు.

సీబీఐ అధికారులు సుశాంత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్లను కూడా ప్రశ్నించారని, వారు సంతృప్తికర సమాధానాలు చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జూన్‌ 14న సుశాంత్‌ బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం అతడి భౌతిక కాయాన్ని డా. ఆర్ఎన్ కూప‌ర్ మున్సిప‌ల్ జన‌ర‌ల్ ఆసుప‌త్రికి తరలించారు. దీంతో ఐదుగురు వైద్యుల బృందం అదే రోజు అర్ధరాత్రి హడావుడిగా పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనితో ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో ముందుగా కోవిడ్‌ పరీక్ష నిర్వహించినప్పటికీ.. ఆ రిపోర్టు రాకముందే పోస్ట్‌మార్టం ఎలా చేశారని  సీబీఐ అధికారులు వైద్యులను అడిగారు. అయితే అందులో ఒక డాక్టర్‌ ముంబై పోలీసులు ఆదేశాల మేరకు అర్ధరాత్రి దాటిన తర్వాత తాము పని పూర్తి చేశామని .. కోవిడ్‌ ఫలితం వెల్లడికాక ముందు పోస్ట్‌మార్టం నిర్వహించకూడదని ఏ ప్రొవిజన్‌లోనూ లేదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. 
 
బుధవారం సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వడంతో శుక్రవారం పది మంది సభ్యుల సీబీఐ బృందం ముంబై చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox