Breaking News

మయూరాలతో మోదీ ఉదయాలు..!

23 rd Aug 2020, UTC
మయూరాలతో మోదీ ఉదయాలు..!

న్యూఢిల్లీ :దేశాన్ని ఏలే ప్రధాని నరేంద్ర మోదీకి మయురాలే నేస్తాలయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ మయూరాలను మచ్చిక చేసుకున్నారు. ప్రధాని నివాసంలోనే ఇవి కూడా నివసిస్తున్నాయి. ఏ మాత్రం భయం బెరుకు లేకుండా, ఈ నెమళ్ళు ప్రధాని మోదీకి ఫ్రెండ్స్ అయిపోయాయి. ఉదయం పూట, ప్రధాని వాకింగ్ చేస్తున్నపుడు, యోగ చేసుకుంటున్నపుడు, ఇవి కూడా పక్కన తిరుగాడుతుంటాయి. పురి విప్పిన నెమళ్లను చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఇవి ఎంతో ఆహ్లాదకరాన్ని కలుగచేస్తాయి.

మోదీ ట్విట్టర్ మాధ్యమంగా ఓ వీడియోను పంచుకున్నారు. ఆయన నివాసంలోని నెమళ్లను, ఆ వీడియోలో చూపించారు. ఈ నెమళ్ళు ప్రధాని నివాస పరిసరంలోనే ఏమాత్రం బెరుకు, భయం లేకుండా సంచరిస్తున్నాయి. పల్లె వాతావరణాన్ని ప్రతిబింభించేలా  ప్రధాని తన నివాసం లో పక్షులకు గూళ్ళు కూడా ఏర్పాటు చేయించారు. ఆయనే స్వయంగా వాటికి ఆహరం అందిస్తున్నారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox