Breaking News

కొలికోడ్‌ ప్రమాదం.. అనుకున్నదంతా అయింది..!

08 th Aug 2020, UTC

కేరళ :కేరళ లోని కొలికోడ్‌ లో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే,ఈ ప్రమాదాన్ని ముందుగానే ఉహించామని  వైమానిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విమానాశ్రయం కొండలపై నెలకొనడంతో, ఇరువైపులా లోయలు ఉన్నాయని వారి గుర్తు చేసుకున్నారు. ఇది ఇలా ఉంటె, లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది.
        వీటి వలన ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయని ఇప్పటికే పలు మార్లు అధికార వర్గానికి విజ్ఞప్తులు చేశామని, అయినా ఎవరు పట్టించుకోలేదని వారు చెప్పుకొచ్చారు. విమానం రన్‌వే చివరకు వెళ్లి రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకవేళ మంటలు వచ్చి ఉంటె, మరింత తీవ్ర ప్రమాదం జరిగేదని  వైమానిక రంగ నిపుణులు అంచనా వేశారు. అపుడు మరింత ఎక్కువ ప్రాణ నష్టం జరిగేదని భావించారు. గతంలో 2010 లో ఇదే తరహా ప్రమాదం మంగళూరులో జరిగింది. అయితే, అక్కడ మంటలు రావడంతో, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. విమానాలు రన్‌వేలపై దిగే సమయంలో టైర్లలోని కొన్ని రబ్బరు శకలాలు కింద పడతాయి. వర్షం కురిసిన సమయాల్లో ఇవి రన్ వె ను మరింత జారుడుగా మారుస్తాయి.

         కొలికోడ్‌ విమానాశ్రయంలో భారీ వర్షం కురవడం తో రన్ వే మరింత జారుడుగా తయారైంది. పైగా రన్ వే ఏటవాలుగా ఉంది. దీనితో, ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కేరళ రాష్ట్రము లో తిరువనంతపురం, కొచి, కొలికోడ్‌, కన్నూర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.  ఉత్తర జిల్లాలైన కాసర్‌గోడ్‌, వయనాడ్‌, కొలికోడ్‌, కన్నూర్‌, మల్లపురం జిల్లాలకు ఈ కోలికోడ్ విమానాశ్రయం సౌకర్యవంతం గా ఉండేది.  కొన్ని సంవత్సరాల క్రితం కన్నూర్‌లో కొత్త విమానాశ్రయం నిర్మించబడింది. అప్పటి నుంచి కోలికోడ్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ తగ్గింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox