Breaking News

ఉద్యోగుల కోసం ఇన్ఫోసిస్ ప్రత్యేక విమానం..!

07 th Jul 2020, UTC

భారత ప్రముఖ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికా లో చిక్కుకున్న తన ఉద్యోగుల కోసం ప్రత్యేక విమానాన్ని పంపించింది. ఈ ప్రత్యేక విమానం ద్వారా రెండు వందల మంది ని అమెరికా నుంచి భారత్ కు రప్పించింది. కరోనా మహమ్మారి కారణం గా ఎక్కడి వారు అక్కడ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. మరో వైపు అమెరికా కూడా చాల మంది విదేశీయుల వీసాలను రద్దు చేస్తోంది. ఈ క్రమం లో అమెరికాలో చిక్కుకుపోయిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల్ని సంస్థ సోమవారం భారత్‌కు తీసుకొచ్చింది.  వారి కోసం ప్రత్యేకం గా విమానం ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చింది. మొత్తం 200 మందిని స్వదేశానికి చేర్చింది. వీరిలో కొంతమంది ఉద్యోగులు కాగా.. మరికొంత మంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.  వీరిని బెంగళూరు కి చేర్చింది. అయితే.. సంస్థ లో ఇప్పటివరకు అమెరికా లో పని చేసిన ఉద్యోగులను.. ఇక పై బెంగళూరు లో కానీ.. ఇండియా లో ఎక్కడైనా ఇన్ఫోసిస్ బ్రాంచ్ లో గాని పని చేయవచ్చని సూచించింది.  స్వదేశానికి చేరుకున్న వారిలో కొంతమంది వీసా గడువు కూడా ముగిసినట్లు  తెలుస్తోంది.  కరోనా మహమ్మారి కారణం గా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రస్తుతం నడవడం లేదు. అన్‌లాక్ 2.0లో భాగంగా ఈ నిషేధాన్ని జులై 31 వరకు పొడిగించారు. కొన్ని కార్గో విమానాలు మాత్రమే నడుస్తున్నాయి.  ఈ నేపధ్యం లో ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల కోసం ప్రత్యేకం గా విమానం ఏర్పాటు చేసింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox