Breaking News

హీరో ముఖ చిత్రాన్ని మార్చేసిన దర్శకుడు.. హ్యేపీ బర్త్ డే పూరీ జగన్నాధ్

28 th Sep 2020, UTC

టాలీవుడ్ : టాలీవుడ్లో ప్రతిభావంతులైన దర్శకులు ఎందరో వున్నారు. వీరిలో ఎవరి స్టైల్ వారిదే. అయితే దర్శకుడు పూరీ జగన్నాధ్ రంగ ప్రవేశంతో మాత్రం హీరో ముఖచిత్రం మారిపోయింని చెప్పవచ్చు. అంతవరకు హీరో అంటే రాముడు మంచి బాలుడు అనే టైపులో్నే తెలుగు సినిమా కధలు సాగేవి. ఎంతో సున్నితంగా,దయతో, ఎటువంటి అలవాట్లు లేనివాడే హీరో అనేది మనలో నాటుకు పోయింది. కాని పూరీ హీరో అంటేనే రఫ్ అండ్ టఫ్. హీరో పాత్ర చిత్రణ కూడ డిఫరెంటే. క్యాజువల్ గా మన కాలనీలో కనపడే అబ్బాయిల్లాగా హీరోని వినూత్నంగా వెండితెరపై పూరీ ఎలివేట్ చేసారు. అందుకే ఆయన సినిమాల టైటిల్స్ కూడ మొదటినుంచి అలానే వున్నాయి. ఇడియట్, పోకిరి. దేశముదురు,నేనింతే సినిమాల టైటిల్స్ ఎంత ప్రత్యేకమో ఆయా చిత్రాల్లోని డైలాగ్స్ కూడ అంతే ఢిపరెంట్ గా వుంటాయి. పూరీ సినిమా అంటే హీరోని ఎలా చూపించారనే ఆసక్తి  ఒకటైతే డైలాగ్ లు ఎలా రాసారనేది మరో టాపిక్.

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు, నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయ్యా, బుల్టెట్ దిగిందా లేదా అని మహేష్ బాబు చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. హీరోకి ధీటుగా విలన్కు కూడ ఆయన అదే రేంజ్లో డైలాగ్ లు పెట్టడం పూరీ స్పెషాలిటీ. ఆయన డైలాగుల్లో జీవిత సత్యాలు కూడ బయటపడుతుంటాయి. జేబులో పది రూపాయలు లేని ఏ వెదవకీ ప్రేమించే హక్కు లేదు. జీవితం ఒక్కో సారి మన సరదా తీర్చేస్తుంది. ఇలాంటి డైలాగ్ లు రావాలంటే అవి పూరీ పెన్నునుంచే వస్తుంటాయి. రవితేజకు హీరోగా ఇమేజ్ తీసుకు వచ్చిన పూరీ ఈ జనరేషన్లో హీరోలందరితోనూ పనిచేసి మంచి సక్సెస్ లు ఇచ్చారు.  

నిర్మాతకు ఇబ్బంది లేకుండా నెలల తరబడి షూటింగ్ లు సాగదీయకుండా త్వరగా సినిమాను ఫినిష్ చేసే దర్శకుడు పరిశ్రమలో పూరీ ఒక్కరే. ఇది స్వయంగా దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కూడ చెప్పారు. తన వారసుడు పూరీనే అని దాసరి అన్నారంటే పూరీ ప్రతిభను అర్దం చేసుకోవచ్చు. ఇది గమనించే మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్  మొదటి సినిమాకు దర్శకుడిగా పూరీని సెలక్ట్ చేసారు. అమితాబ్, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలను డైరెక్ట్ చేసిన పూరీ. యువ హీరోలతో కూడా సినిమాలు తీసారు.  

పూరీ మంచి దర్శకుడు, రచయితే కాదు. మంచి మనిషి కూడ. అందుకే ఆయనతో పరిచయం అయిన వారు అంత త్వరగా డిస్ కనెక్ట్ అవ్వరు. వ్యక్తులను నమ్మి రూ.100 కోట్లరూపాయల వరకూ మోసపోయి మరలా నిలబడ్డారంటే మామాలు విషయం కాదు. అది ఆయనకే చెల్లింది. తన వారు అనుకున్న వారందరికీ మంచి లైఫ్ ఇవ్వాలనుకునే వ్యక్తి ఆయన. వరుస విజయాలే కాదు వరుస పరాజయాలు వచ్చినపుడు కూడ ఆయన కుంగి పోలేదు. తన సత్తా ఏమిటో పరిశ్రమ సంగతి ఏమిటో పూర్తిగా అవగాహన వున్న వ్యక్త ఆయన. గత ఏడాది ఇస్మార్ట్ట్ శంకర్ తో మరలా మాస్ హీరోని చూపాలంటే పూరీయే చూపాలని నిరూపించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న పూరీ జగన్నాథ్ తరువాత కొడుకు ఆకాష్ తో సినిమా చేయాలని నిర్ణయించారు. కరోనా సమయంలో 'పూరీ మ్యూజింగ్స్' పేరుతో జీవిత సత్యాలను బోధిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్నారు. తన  20 ఏళ్ళ సినీ ప్రస్థానంలో అద్భుతమైన చిత్రాలను అందించించిన పూరీ పుట్టిన రోజు సందర్బంగా హీరోలు ,దర్శకులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox