టాలీవుడ్ :మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ మూవీ పోస్టర్ రిలీజైంది.
మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కానుకగా ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా శనివారం సాయంత్రం చిత్రయూనిట్ ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. చిరు నుంచి అభిమానులు ఏం అయితే కోరుకుంటారో, అదే రివీల్ చేస్తూ,మోషన్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో చేతిలో కత్తి పట్టుకొని ఉన్న చిరంజీవి సైడ్ లుక్ చూపించారు. ధర్మస్థలి అనే గ్రామం చూపిస్తూ, కొందరు పేదవారు దీనంగా చూస్తుంటే, అన్యాయం చేసేవారిని చిరు పై లోకాలకు పంపిస్తున్నట్లుగా ఈ మోషన్ పోస్టర్లో చూపించారు'. దీనికి మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది. ఆచార్య' చిత్రాన్ని 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డైరెక్టర్ కొరటాల శివ ట్విట్టర్ వేదికగా 'ఆచార్య' ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ''ధర్మం కోసం ఒక కామ్రేడ్ అన్వేషణ'' అని పేర్కొన్నారు.మొత్తంగా చూస్తే, ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా కొరటాల తెరకెక్కిస్తున్నట్లుగా అర్థం అవుతుంది.
మరిన్ని వార్తలు చదవండి.