Breaking News

క్షీణిస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం..!

26 th Aug 2020, UTC
క్షీణిస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం..!

న్యూఢిల్లీ :మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం రాను రాను క్షీణీస్తోంది. మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో  కొద్దీ రోజుల క్రితమే ప్రణబ్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో ఆయనకు కరోనా కూడా సోకినట్లు తేలింది. గత కొన్ని రోజులుగా ఆయన న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తులకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకడంతో గత కొన్ని రోజులుగా ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

తాజాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి పై న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. పిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స అందుతోందని, నిన్నటి నుంచి, కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు బాగాలేదని  ఆర్మీ ఆసుపత్రి ఈ బులెటిన్ లో పేర్కొంది. అయితే.. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స కొనసాగుతోంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox