Last Updated:

WhatsApp Down: మధ్యాహ్నం 12 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సప్ సేవలు

ఔటేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్ కూడా ఈ విషయాన్ని వెంటనే వెల్లడించింది. ఇండియాలో వేలాది మంది యూజర్లు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసినట్టు పేర్కొంది. దాదాపు చాలా నగరాల్లో ఈ వాట్సాప్‌ సర్వీస్‌లు నిలిచిపోయానని తెలుస్తోంది.

WhatsApp Down: మధ్యాహ్నం 12 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సప్ సేవలు

WhatsApp Down: పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ సేవలకు అంతరాయం కలిగింది. భారత్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. వేలాది మంది యూజర్లు ఈ విషయం పై ఫిర్యాదులు చేస్తున్నారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు సెండ్ అవడం లేదు. అవతలి వారికి వెళ్ళడం లేదు. మొత్తంగా వాట్సాప్‌ సర్వీస్‌లన్నీ ఆగిపోయాయి. ఐతే ఈ విషయం పై వాట్సాప్‌ ఇంకా స్పందించలేదు. సర్వర్లలో లోపం కారణంగానే వాట్సాప్‌లో సమస్య తలెత్తినట్టు తెలుస్తుంది.

వాట్సాప్‌ పర్సనల్ చాట్స్‌తో పాటు గ్రూప్స్‌కు కూడా ఈ సమస్య తలెత్తింది. గ్రూప్స్ లో కూడా ఎలాంటి మెసేజ్‌లు సెండ్ అవడం లేదు. ఐతే ఎక్కువగా పర్సనల్ చాట్స్‌లోనే ఈ ఔటేజ్ తలెత్తింది. మేసెజ్‌లు పంపడం ప్రస్తుతం అవ్వడం లేదు. ఔటేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్ కూడా ఈ విషయాన్ని వెంటనే వెల్లడించింది. ఇండియాలో వేలాది మంది యూజర్లు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసినట్టు పేర్కొంది. దాదాపు చాలా నగరాల్లో ఈ వాట్సాప్‌ సర్వీస్‌లు నిలిచిపోయానని తెలుస్తోంది.

ఈ విషయం పై వాట్సాప్‌ ఇంకా అధికారికంగా స్పదించలేదు. ఐతే త్వరలోనే దీనిపై స్పస్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సమస్యకు త్వరగా పరిష్కరించే ఛాన్స్ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి: