Breaking News

దొంగతనం చేసి.. స్టేటస్ లో పెడితే ఇంతే..!

31 st Oct 2020, UTC

హైదరాబాద్ :కొన్ని కొన్ని కేసులు పోలీసులకు సవాళ్లుగా మారతాయి. చిన్న క్లూ కూడా దొరకని కేసులను ఛేజ్ చేయడం పోలీసులకు కొంతమేర కష్టతరంగానే ఉంటుంది. అయితే పరిశీలిస్తూ ఉంటె ఎక్కడో చిన్న డొంక తగులుతుంది. అంతే ఖేల్ కతం. కేసు క్లోజ్ అయిపోతుంది. అలాంటి ఘటన ఒకటి రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ లో రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సాయి కిరణ్ అనే ఓ వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ విషయమై గతేడాది జులై 12న సాయి కిరణ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఈ కేసు విషయమై పోలీసులు అప్పటినుంచి ప్రయత్నాలు  చేస్తున్నా, వారికి ఇలాంటి క్లూ దొరకలేదు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఇటీవల సాయికిరణ్ నివాసం పక్కన ఉండే ఓ మహిళా అన్ని ఆభరణాలు పెట్టుకుని రెడీ అయి ఫోటో తీసుకుంది.

ఆ ఫోటోను స్టేటస్ లో పెట్టుకోవడంతో సాయి కిరణ్ ఆ ఫోటోని చూసి అనుమానించాడు. ఆ ఫొటోలో మహిళా ధరించిన నగలపై సాయి కిరణ్ కు అనుమానం వచ్చి పోలీసులను సంప్రదించాడు. అయితే పోలీసులు తమ శైలిలో ఆ మహిళను ప్రశ్నించగా ఆమె అసలు విషయం బయటపెట్టేసింది. ఆ మహిళా, తన కొడుకు జితేందర్ ఈ దొంగతనం చేసినట్లు చెప్పేసింది. ఒక్క వాట్సాప్ స్టేటస్. ఏడాది పాటు నలుగుతూన్న కేసుకు ముగింపు పలికింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox