Breaking News

దారుస్సలాంను కూల్చేస్తాం.. బండి సంజయ్ 

25 th Nov 2020, UTC
దారుస్సలాంను కూల్చేస్తాం.. బండి సంజయ్ 

హైదరాబాద్ :పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలన్న అక్బర్ వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా? నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా భాయ్. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండు గంటలల్లోనే నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరంలోని అమీర్ పేట్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచార సభలో బుధవారం పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మభ్యపెట్టి, ఏమార్చి ఓట్లు పొందాలని టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు చూస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు చేవచచ్చి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నాయకులు చేసే సవాల్‌ను స్వీకరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని, ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. హిందువులు అందరూ ఓటు బ్యాంకుగా మారితేనే హైదరాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని అన్నారు.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బుధవారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox