Breaking News

పాతబస్తీ అభివృద్ది కోసం రూ.14 వేల కోట్లు ఖర్చు పెట్టాం.. మంత్రి కేటీఆర్

04 th Oct 2021, UTC

 పాతబస్తీ  అభివృద్ది కోసం తమ ప్రభుత్వం రూ. 14 వేల 887 కోట్లు ఖర్చు చేసినట్టుగా మంత్రి కేటీఆర్  చెప్పారు. సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో  పాతబస్తీ అభివృద్దిపై  సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

అధికార, విపక్ష సభ్యులు అనే వివక్ష లేకుండానే కేసీఆర్అభివృద్ది చేస్తున్నారని మంత్రి తెలిపారు. 2004 నుండి 2014 మధ్య కాంగ్రెస్  ప్రభుత్వం  పాతబస్తీ అభివృద్ది కోసం ఖర్చు చేసింది  రూ.3934 కోట్లు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.పాతబస్తీలో రూ.1540 కోట్ల ఖర్చుతో ఎస్ఆర్‌డీపీ (srdp)కింద రోడ్లు అభివృద్ది చేస్తున్నామన్నారు. సీఆర్ఎంపీ (crmp)కింద రూ. 118 కోట్ల ఖర్చుతో రోడ్లు నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. 

పాతబస్తీ, కొత్త నగరం అనే తేడా లేకుండా  హైద్రాబాద్ ను అభివృద్ది చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పాతబస్తీలో 44 ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ది చేస్తున్నామని మంత్రి  చెప్పారు.అన్నపూర్ణ పథకం ద్వారా పాతబస్తీలో 2 కోట్ల మందికి భోజనం పెట్టామన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox