Breaking News

Vijayashanti : కేంద్రం నూతన విద్యావిధానం భేష్.. విజయశాంతి

31 st Jul 2021, UTC

Hyderabad : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం విద్యావిధానంలో తీసుకు వచ్చిన మార్పులను బీజేపీ నేత విజయశాంతి ట్విటర్ లో  ప్రశంసించారు. దీనిపై వరుస ట్వీట్లు చేసారు. దశాబ్దాల కాలంగా మన దేశంలో అమలవుతూ వచ్చిన విద్యా విధానం వివేకం లేని యంత్రాల్లాంటి ఉద్యోగులనే ఎక్కువగా సృష్టించింది తప్ప నాయకత్వ లక్షణాలు గల బాధ్యతగల పౌరుల్ని తయారు చెయ్యడంలో విఫలమైందని చెప్పక తప్పదు.

ఈ పరిస్థితుల్ని తిరగరాస్తూ ప్రధాని మోదీగారి నాయకత్వంలోని ప్రస్తుత సర్కారు గత ఏడాది నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన వ్యవస్థలో అన్ని వర్గాలకూ లాభదాయకంగా ఉండేలా అఖిల భారత వైద్య విద్యలో ఓబీసీలకు 27 శాతం. ఈడబ్ల్యుఎస్ వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఎంతో శుభపరిణామం. కరోనా వంటి ప్రకృతి విపత్తులు విలయతాండవం చేస్తున్న తరుణంలో మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కృత్రిమ మేధస్సులో శిక్షణనివ్వాలన్న ఆలోచన. మన కేంద్ర ప్రభుత్వ ముందు చూపునకు దర్పణం పడుతోంది. ఇక ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లో అందించాలన్న నిర్ణయం మన దేశీయ భాషలకు కొత్త ఊపిరిపోస్తూ భావితరాలకు మాతృభాషలోని మాధుర్యాన్ని అందిస్తుంది.

ఈ క్రమంలోనే బధిర లిపిని ఇతర భాషల్లాగే విద్యాసంస్థల్లో చదువుకోవడానికి వీలు కల్పించడమన్నది ఆ ప్రత్యేక అవసరాలున్న పౌరుల పట్ల మన ప్రధాని సమ దృష్టిని తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాలను రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకుని బాధ్యత గల రేపటి పౌరులను తయారు చెయ్యడంలో తమ వంతు కృషి చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ విజయశాంతి ట్వీట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox