Breaking News

vijayashanti: బీజేపీ ప్రభుత్వం వస్తే బంగారు బోనం ఎత్తుతాను.. విజయశాంతి

01 st Aug 2021, UTC

Hyderabad :ఆదివారం బీజేపీ నేత విజయశాంతి లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం తెలంగాణ వస్తే బంగారు బోనం ఎత్తుకుంటానని మొక్కుకున్నానని, అమ్మవారు తెలంగాణ ఇచ్చిందని, బంగారు బోనం ఎత్తానని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో ప్రజలు బాధపడుతున్నారని, కరోనా తగ్గి అందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణలో పాలన బాగోలేదని అమ్మవారు కూడ చూస్తున్నారని విజయశాంతి అన్నారు. ప్రజా పాలన బీజేపీ వల్లే సాధ్యమవుతుందన్నారు. అందువల్ల బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox