Breaking News

నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ విజయం

02 nd May 2021, UTC
నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ విజయం

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ 18,449 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై నోముల భగత్ విజయం సాధించారు. వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలో నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించారు. 10,11,14 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యం కనబరిచారు.

మిగితా రౌండ్లలో మాత్రం టీఆర్‌ఎస్ ముందుంది. ఇక కాంగ్రెస్‌కు 59, 239 ఓట్లు, బీజేపీకి 6,365 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో నిలువగా, బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాకుండా పోయింది.

ఉప ఎన్నికలో విజయం సాధించడంపై ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని సీఎం కేసీఆర్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తనను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు పాదాభివందనాన్ని ప్రకటించారు. గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. తండ్రి నోముల నర్సింహ్మయ్య ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తానని, అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తానని నోముల భగత్ ప్రకటించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox